Thursday, 24 September 2026 08:05:25 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

*గురువులే భావి సమాజానికి మార్గదర్శకులు*

పటాన్‌చెరులో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

Date : 22 September 2026 04:22 PM Views : 35

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : *100 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం* విద్యార్థులనువిద్యావంతులుగాతీర్చిదిద్దడమేకాకుండా,వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పాండుతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గత 25 ఏళ్లుగా గురుపూజోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అదనపు కలెక్టర్ పాండు అభినందించారు.ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ.. విద్యార్థి జీవితానికి ఉపాధ్యాయుడు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఉపాధ్యాయులు విద్య, విజ్ఞానం, విలువలను అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి పటాన్‌చెరులో చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పాఠశాలల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం సమాజానికి తీవ్ర సమస్యగా మారుతోందని అన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచే మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి కీలకమన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని, నాణ్యమైన విద్య అందించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని తెలిపారు. గత 25 ఏళ్లుగా గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు.అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘గురువులకు పాదాభివందనం’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ప్రదర్శనకు ముగ్ధుడైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.26 వేల నగదు బహుమతిని అందించి అభినందించారు.కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :