Saturday, 26 September 2026 11:23:26 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

ప్రతి చిన్నారి ఆరోగ్యం మన అందరి బాధ్యత

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి

Date : 28 June 2026 06:06 PM Views : 74

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్, జూన్ 28: ప్రతి చిన్నారి ఆరోగ్య రక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి సహకరించాలని అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు.జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీరంగూడ డివిజన్ పరిధిలోని మల్లారెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన పోలియో శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి విడతలోనూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని సూచించారు. తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలను సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి రెండు చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :