ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చేరు మండలం పెద్దకంజర్ల గ్రామ చౌరస్తా వద్ద రహదారి దుస్థితిని నిరసిస్తూ బీజేపీ నాయకులు బైఠాయించి ధర్నా నిర్వహించారు.పటాన్‌చేరు నుంచి కంజర్ల, శివనగర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి నూతన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని, ఈ రహదారిపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు వెంటనే స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి రాకపోకలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి హాజరై నాయకులకు సంఘీభావం తెలిపారు.
Admin
ప్రజా పిలుపు