ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : హత్నూర మండలం సాదుల్‌నగర్ గ్రామానికి చెందిన గోని ఆనంద్, వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పుల్లబోయిన ఉమారాణిలకు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి రూ.2.50 లక్షల చొప్పున, మొత్తం రూ.5 లక్షల విలువైన వైద్య సహాయ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స ఖర్చులు భారంగా మారకుండా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Admin
ప్రజా పిలుపు