Thursday, 24 September 2026 10:58:08 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

అంబేద్కర్ సాక్షిగా హెచ్చరిక – పటాన్‌చెరులో నిరసన

Date : 08 September 2026 10:25 PM Views : 67

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై పటాన్‌చెరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీ విగ్రహం నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.పటాన్‌చెరు యువ నాయకులు జలగరి దేవకుమార్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పదవులకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. దళిత స్పీకర్‌ను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై తాతా మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అలాంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను, దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యలని పేర్కొంటూ, ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు కూడా హద్దు ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యేపూరి శివానందం తెలంగాణ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :