Friday, 25 September 2026 01:21:36 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

కెసిఆర్ పై విద్వేషాపూరిత వ్యాఖ్యలు మనకపోతే రేవంత్ కు గుణపాఠం తప్పదు......

నువ్వు ఎన్ని జన్మలెత్తినా కెసిఆర్ ను తెలంగాణా ప్రజల హృదయాలనుండి చెరపలేవు.... గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.....

Date : 19 July 2026 09:48 PM Views : 70

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : గజ్వేల్ వేదిక ఏదైనా కెసిఆర్ వారి కుటుంబాన్ని తిట్టడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడని,మరోసారి కెసిఆర్ మీద మూర్ఖంగా మాట్లాడితే గుణపాఠం తప్పదని గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హెచ్చరించారు. ముప్పై నెలల పరిపాలనలో అద్భుతమైన ప్రగతితో దూసుకెళ్లిన తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు రేవంత్ రెడ్డి వెనక్కి మల్లించారని ఆ వైఫల్యాలనుండి ప్రజల దృష్టి మరల్చేందుకే కెసిఆర్ మీద వారి కేటిఆర్ హరీష్ రావుల మీద మాట్లాడలేని భాషతో ముఖ్యమంత్రిగా కాకుండా మూర్ఖునిలా విరుచుకపడుతున్నాడని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రజలకోసం పని చేసి నాయకుడిగా ఎదగలేదని అందుకే ఏమాత్రం విలువలు లేకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. కెసిఆర్ దాదాపు ఐదు దశబ్దాలుగా ప్రజాసేవలో నిమగ్నమై నాలుగు దశాబ్దాలుగా ఓటమి ఎరుగని నేతగా, అన్నింటికంటే గొప్పగా రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రక్తం చుక్క చిందకుండా ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడని, అట్లాంటి గొప్ప నాయకుడిని నీ చిల్లర మాటలతో ఆయన విలువ తగ్గుతుందనుకున్నా, తెలంగాణ ప్రజల హృదయాలలోనుండి ఆయన్ని చెరిపివేయాలని అనుకోవడం మూర్ఖత్వం అని అన్నారు.ఆరు గ్యారంటీల పేరుతో అనేవి కాని హామీలిచ్చి వాటిని ఆమలు చేయలేక పదే పదే కెసిఆర్ ను దూషించడం ద్వారా ప్రజల దృష్టి మరల్చవచ్చు అనే నీచమైన రీతిలో రేవంత్ రెడ్డి పాలిస్తున్నాడని, ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించి కెసిఆర్ కుటుంబం మీద దివాలా కోరు వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి కాలం ఎల్లదీస్తున్నాడని అన్నారు. ఒకవైపు రాష్ట్రం కరువు కోరలతో అల్లాడుతూ రైతాంగం అంతా నీళ్లకోసం పరితపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కెసిఆర్ కుటుంబ సభ్యుల రక్తాన్ని కోరుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించే గొప్ప బాధ్యత కల్గిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రంలో చావులను ఆపాల్సింది పోయి రోజురోజుకూ రాష్ట్రంలో ఒక వైపు అన్నదాతలు, నేతన్నలు, కార్మికులు ఇట్లా అనేక వర్గాల ప్రజలు ఆత్మహత్యలు పెరుగుతున్నా, మరోవైపు శాంతి భద్రతలు కరువై హత్యలు పెరుగుతున్నా పట్టనట్టు వ్యవహరించే రేవంత్ రెడ్డి కెసిఆర్ చావును కోరుకోవడం అయన దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.నువ్వెన్ని చిల్లర మాటలు మాట్లాడినా, ముఖ్యమంత్రివి అయినా ప్రజలల్లో నీ స్థాయి పెరగలేదు, పెరగదు కూడా అదేవిధంగా నువ్వెన్ని పిల్లి శాపనార్ధాలు పెట్టినా రాబోయే ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసి కెసిఆర్ ను ప్రజలే ఆశీర్వధించి తమ భుజాల మీద తీసుకువచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్రాన్ని కాపాడుకుంటారని అన్నారు. మరోసారి మూర్ఖంగా కెసిఆర్ మీద మూర్ఖంగా మాట్లాడితే తెలంగాణ వాదులుగా మేము కూడా ముహ్ తోడ్ జవాబు ఇవ్వవలసి వస్తాదని హెచ్చరించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :