Thursday, 24 September 2026 08:05:25 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

వివేకానంద పార్క్‌ను సందర్శించిన మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

Date : 22 September 2026 04:24 PM Views : 20

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఓల్డ్ ఎంఐజీ కాలనీలోని వివేకానంద పార్క్‌ను యూబీడీ మేనేజర్ సతీష్‌తో కలిసి సందర్శించారు.తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో పార్క్ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ఆట వస్తువులు, బహిరంగ వ్యాయామశాల, బహుళ ప్రయోజన క్రీడా మైదానం తదితర పనుల పురోగతిపై యూబీడీ మేనేజర్ సతీష్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.పార్క్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సింధు ఆదర్శ్ రెడ్డి కోరారు. ముఖ్యంగా చిన్నారులు, యువతకు పార్క్‌లోని సౌకర్యాలు ఉపయోగపడేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యూబీడీ పర్యవేక్షకుడు రాములు, సొసైటీ అధ్యక్షుడు బాలయ్య, ఉపాధ్యక్షుడు నారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ నాగమణి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ ముదిరాజ్, చిన్నా, శ్రీనివాస్, రాకేష్ రెడ్డి, లక్ష్మి, స్వర్ణలత, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :