Monday, 09 November 2026 03:10:04 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పటాన్‌చెరులో పోటాపోటీ ధర్నాలు.. ఉద్రిక్తత

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకవైపు..పాలిటెక్నిక్‌ విద్యార్థులు మరోవైపుహోరాహోరీ నినాదాలతో దద్దరిల్లిన పటాన్‌చెరు .మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని brs

Date : 08 September 2026 12:13 PM Views : 209

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : దళిత ద్రోహి కేసీఆర్‌ అంటూ కాంగ్రెస్‌ ఆగ్రహం : పటాన్‌చెరు పట్టణంలో మంగళవారం పోటాపోటీగా జరిగిన ఆందోళనలతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పరస్పరం నిరసనలు, నినాదాలు చేపట్టగా.. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పటాన్‌చెరు ప్రధాన ప్రాంతాలు నిరసనలతో హోరెత్తాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.అసెంబ్లీలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీ పార్క్‌ నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దళితులను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నాయకులు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసనకు దిగారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో ఇరుపక్షాల మధ్య వాతావరణం వేడెక్కింది.ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్‌ విద్యార్థులు కూడా ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్‌ విద్యను శక్తి (యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ) పరిధిలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. తమ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని, పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఒకే ప్రాంతంలో రాజకీయ పార్టీల ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు కొనసాగడంతో పటాన్‌చెరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ నినాదాలు చేయగా, విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నినదించారు. దీంతో పటాన్‌చెరు పరిసర ప్రాంతాలు హోరాహోరీ నినాదాలతో దద్దరిల్లాయి.పరిస్థితిని గమనించిన పోలీసులు ఇరువర్గాలను సముదాయిస్తూ శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పటాన్‌చెరులో రాజకీయ, విద్యార్థి ఆందోళనలతో ఉత్కంఠ కొనసాగింది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :