ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిన్నారం: రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని సోలక్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయి బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, కమిషనర్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు