ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.25 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని చాప్టా (కే) గ్రామంలో చోటుచేసుకుంది.ఎస్సై దుర్గారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కురుమ నాగ్‌గొండ, ఆయన భార్య జగదేవి ఇంటికి తాళం వేసి స్థానిక హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం రాత్రి వినాయక మండపంలో నిర్వహించిన భజన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరూ హనుమాన్ మందిరానికి వెళ్లారు.వారు ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న బంగారం, వెండి, నగదును అపహరించినట్లు ఎస్సై తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గారెడ్డి పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు