ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని సిద్దిపేట జిల్లా చౌదర్పల్లి గ్రామ సర్పంచ్ లింగ రవి అన్నారు, ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తన కుమారుడిని గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదర్పల్లి లో చేర్పించిన చౌదర్పల్లి గ్రామ సర్పంచ్ లింగ రవిస్థానిక చౌదర్పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారావు చేతులమీదుగా తన కుమారుడు ప్రదీప్ 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకుని పాఠశాలలో చేర్పించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లింగ రవి మాట్లాడుతూ తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నానని ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని , చక్కని గాలి వ్యక్తులు కలిగిన తరగతి గదులు మధ్యాహ్న భోజనం ఉచిత పుస్తకాలు దుస్తులు మొదలగు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందనిచౌదర్పల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నరసింహారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం చక్కని బోధన అందిస్తుందని ప్రైవేటు పాఠశాలలతో పోల్చుకుంటే అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే మేలని సర్పంచ్ లింగ రవి అన్నారుగ్రామస్తులందరికీ ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లలను చేర్పించానని రవి అన్నారుచౌదర్పల్లి పాఠశాలలో గత సంవత్సరం త్రిబుల్ ఐటీ సీటు సాధించారని ప్రస్తుతం 100% ఫలితాలతో పాఠశాల ప్రగతి పథంలో నడుస్తుందని తెలిపారుఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసింహారావు తో పాటు ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి ఆదరాసు పల్లి శశిధర్ శ్రీపాల్ రెడ్డి శైలజ వెంకటమ్మ కనకయ్య మమత తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు