Wednesday, 11 November 2026 04:39:37 PM
# నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం # శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. # నవంబర్ 15న పటాన్‌చెరు సాకి చెరువు వేదికగా ఛట్ పూజ వేడుకలు..ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు.. # ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి # ఇస్నాపూర్ నూతన సీఐ టి. మహేష్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నిజాముద్దీన్ బాబా # బీరంగూడ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన బస్సు # యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం..దాతలు ముందుకు రావడం సంతోషం: డిజిపి సి. వి. ఆనంద్ # పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి # యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్

*పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ఐలాపూర్ మాణిక్ యాదవ్

Date : 19 July 2026 08:45 PM Views : 124

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్ పూర్:శ్రీ వేణుగోపాల స్వామిదేవాలయం ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీలో అత్యంత వైభవంగా నిర్వహించిన 2వ పూరీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ పవిత్ర మహోత్సవంలో బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్ర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి దివ్య ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు మరియు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రథయాత్రలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. జై జగన్నాథ నామస్మరణలతో, భజనలు, కీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తులు స్వామివారికి ప్రత్యేక హారతులు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఐలాపూర్ మాణిక్ యాదవ్ మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐకమత్యాన్ని, సనాతన ధర్మ విలువలను మరియు భక్తి భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. శ్రీ జగన్నాథ స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు మరియు సేవలందించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :