Thursday, 24 September 2026 12:20:56 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

*ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి*

Date : 08 August 2026 06:46 PM Views : 83

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గుమ్మడిదల, ఆగస్టు 8: గత ఏడాది ఫలహారం బండి ఊరేగింపు సందర్భంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో ఈ ఏడాది బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులను ప్రశాంతంగా నిర్వహించేందుకు గుమ్మడిదల పోలీస్ స్టేషన్‌లో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గుమ్మడిదల ఎస్‌ఐ గ్రామస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పండుగల నిర్వహణపై సూచనలు చేశారు. ఎలాంటి కుల దూషణలకు పాల్పడకుండా, గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని తెలిపారు.బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని సూచించారు. పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :