Sunday, 08 November 2026 02:59:37 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం

వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన పలువురికి అస్వస్థత

Date : 13 October 2026 06:18 PM Views : 312

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ పట్టణంలోని మెదక్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మంగళవారం రెస్టారెంట్‌లో భోజనం చేసిన ముగ్గురితో పాటు మరికొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పట్టణంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. అస్వస్థతకు గురైన వారిలో కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అయితే, బాధితుల సంఖ్య, అస్వస్థతకు గల ఖచ్చితమైన కారణాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.ఈ ఘటనతో పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. రెస్టారెంట్‌లో వడ్డించిన ఆహారం వల్లే అస్వస్థతకు గురయ్యారా? ఆహార పదార్థాల నిల్వ, తయారీ విధానాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు.ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి రెస్టారెంట్‌లోని ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు బయటపడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే నర్సాపూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి ఆహార భద్రతా ప్రమాణాలు అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఆహార భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :