Sunday, 08 November 2026 02:23:28 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఓటు హక్కును హరించే కుట్రలను సహించేది లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం ఆగదు: నీలం మధు

ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి*

Date : 01 November 2026 07:11 PM Views : 41

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని బలిచేయొద్దని, ప్రజల ఓటు హక్కును హరించే కుట్రలను సహించేది లేదని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.ఏఐసీసీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ భారీ నిరసన కార్యక్రమంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన మద్దతు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశాల్లోనూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు తలెత్తే పరిస్థితులకు పాలకులు కారణమవుతున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు అనేది సామాన్యుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఆ హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే హక్కును ప్రశ్నార్థకం చేసే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వమే వాటిని బలహీనపరిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.దేశంలోని ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను, ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల గొంతుకను అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా పోరాటం సాగిస్తుందని హెచ్చరించారు.రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు మద్దతుగా నిలవాలని నీలం మధు ముదిరాజ్ కోరారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యమే దేశానికి అసలైన బలమని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, ఓటు హక్కు కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :