ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ, మండల అధ్యక్షుల సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాబోయే గాంధీ జయంతిని పురస్కరించుకుని చేపట్టనున్న గాంధీ గ్రామ శ్రమదానం కార్యక్రమ నిర్వహణ, నూతన మండల కమిటీల సమావేశాలు, గ్రామ కమిటీల బలోపేతం, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుల నివేదికలు, మండల, గ్రామ స్థాయిలో సామాజిక మాధ్యమాల వినియోగం తదితర అంశాలపై చర్చించారు.అక్టోబర్ 2న జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులంతా ఒక గంట పాటు సామూహిక శ్రమదానంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి పిలుపునిచ్చారు.
Admin
ప్రజా పిలుపు