ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇంద్రేశం మున్సిపాలిటీలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయంతో పాటు వివిధ విభాగాల పనితీరును పరిశీలించిన ఆయన, పారిశుద్ధ్యం, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులను ఆరా తీశారు.ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, సమయపాలనతో అందించాలని అధికారులకు సూచించారు.పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా సంబంధిత మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు