ప్రజా పిలుపు / తెలంగాణ / మహబూబాబాద్ : వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవడానికి అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరిష్ సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హత కలిగిన వారు నిర్ణీత గడువులోగా ఫారం-18 ద్వారా దరఖాస్తు సమర్పించాలని కోరారు.2026 నవంబర్ 1వ తేదీ నాటికి కనీసం మూడేళ్ల ముందే డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఆన్‌లైన్‌లో ceotelangana.nic.in వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల కుటుంబాల్లో డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఉంటే, వారు కూడా తమ అర్హతను పరిశీలించుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.
Admin
ప్రజా పిలుపు