Friday, 25 September 2026 10:00:54 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ*

విదేశీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి: ఎస్పీ పరితోష్ పంకజ్

Date : 24 September 2026 08:12 PM Views : 17

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జోగిపేట సబ్‌జైల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రాన్ని) జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాన్సిట్ హోంలోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.పాస్‌పోర్ట్ గడువు ముగియడం, ఇతర కారణాల వల్ల దేశంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన విదేశీయులను వారి స్వదేశాలకు తిరిగి పంపించే వరకు ట్రాన్సిట్ హోంలో ఉంచుతున్నట్లు ఎస్పీ తెలిపారు. అక్కడ ఉంటున్న విదేశీయుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.విదేశీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులు, సదుపాయాలు కల్పించాలని, నిబంధనలకు అనుగుణంగా వారిని సంరక్షించాలని సూచించారు. ట్రాన్సిట్ హోం పరిసరాల్లో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి తెలిపారు. విదేశీయులు తమ దేశాలకు సురక్షితంగా తిరిగి వెళ్లే వరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ తనిఖీలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐ శ్రీకాంత్, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :