Friday, 25 September 2026 01:23:38 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

లంచం తీసుకుంటూ విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కిన వైనం

ప్రైవేట్ కళాశాలకు అనుకూల నివేదిక కోసం రూ.50 వేల డిమాండ్..రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

Date : 09 September 2026 07:07 PM Views : 79

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో లంచం తీసుకుంటున్న విద్యాశాఖ అధికారి గోవిందరామ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేసి అనుకూల నివేదిక ఇచ్చేందుకు గోవిందరామ్ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా గత వారం బాధితుడి నుంచి రూ.30 వేలు తీసుకున్నట్లు సమాచారం.మిగిలిన రూ.20 వేలు ఇవ్వాలని అధికారి ఫోన్ చేసి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం కార్యాలయంలో రూ.20 వేలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం దాడి చేసి గోవిందరామ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది.అనంతరం ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :