Thursday, 24 September 2026 12:10:27 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

*ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు

పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

Date : 09 September 2026 07:18 PM Views : 48

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి అన్నారు.ఈ మేరకు బుధవారం పటాన్‌చెరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక సీఐ రవీందర్‌ను కలిసి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.కేటీఆర్‌పై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుని, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరినట్లు నర్సింహారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, యువరాజ్, అక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :