Saturday, 26 September 2026 11:25:13 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

కాలనీవాసుల విన్నపంతో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్*

Date : 25 June 2026 02:44 PM Views : 105

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు, జూన్ 25 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు :జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని భగత్ గల్లి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో పరిష్కరించారు. గత ఏడాది కాలంగా బోరు మోటర్ పాడవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని కాలనీ వాసులు ఆజాం, జబ్బర్‌లు మెట్టు కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సమస్యను పరిశీలించారు. అనంతరం సొంత నిధులతో నూతన బోరు మోటర్‌ను ఏర్పాటు చేసి బోరుబావిలో బిగింపజేయడంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. సమస్యను వెంటనే పరిష్కరించినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ మెట్టు కుమార్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలోని వెంకటేశ్వర థియేటర్ సమీపంలో వర్షపు నీరు నిలిచి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో జేసీబీ యంత్రాన్ని ఏర్పాటు చేసి మట్టి వేసి ప్రాంతాన్ని చదును చేయించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మెట్టు కుమార్ యాదవ్, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలియజేయడంతో మెట్టు కుమార్ యాదవ్ కాలనీల్లో పర్యటించారు.జి హెచ్ ఎం సి సిబ్బందితో కలిసి పూడికతీత పనులు చేపట్టించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :