ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వినాయక నిమజ్జనాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.నారాయణఖేడ్, మానూర్, నాగల్గిద్ద మండలాలకు చెందిన వినాయక విగ్రహాల నిమజ్జనాలు నిర్వహించనున్న మానూర్ మండలం కమలాపురం చెరువును మంగళవారం జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా చెరువు వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.9,11 రోజుల వినాయక నిమజ్జనాల సందర్భంగా పెద్ద సంఖ్యలో విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. నిమజ్జన ప్రాంతంలో అవసరమైన లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లను ముందుగానే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.గణేష్ శోభాయాత్రలు జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చోట మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే చెరువు వద్ద బారికేడింగ్, భద్రతా లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఫైర్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. భక్తులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.ఎస్పీ వెంట నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు