Sunday, 08 November 2026 02:55:47 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కరెంటు కోతలతో రోడ్డెక్కిన రైతులు.. రెడ్డిపల్లి వద్ద రాస్తారోకో

Date : 09 October 2026 04:11 PM Views : 255

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : పంట పొలాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా పరిధిలోని రెడ్డిపల్లి, ఆవంచ గ్రామాల రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు కేవలం ఐదు నుంచి ఆరు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని, దీంతో వరి పంట పొట్ట దశలోనే ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.వ్యవసాయానికి రోజుకు 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏడీ రాఘవేంద్రరావు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులతో చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :