ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సదాశివపేట: మాజీ కో-ఆప్షన్ సభ్యులు వసీం అక్ఱమ్ తల్లి మృతి వార్త అత్యంత బాధాకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేటలోని వసీం అక్ఱమ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ (21వ వార్డు) మొహమ్మద్ ముబీన్ మొహియుద్దీన్, సదాశివపేట టౌన్ బీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ కామీల్ అంసార్, బీఆర్‌ఎస్ నాయకులు మొహమ్మద్ లతీఫ్, మొహమ్మద్ ఖుద్దూస్, మొహమ్మద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు