Saturday, 26 September 2026 11:24:16 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

*నూతన దేవాలయాల నిర్మాణాలకు అండగా ఉంటాం: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 27 June 2026 05:33 PM Views : 92

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జూన్ 27:ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించే దేవాలయాల నిర్మాణం, అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ డివిజన్ పరిధిలోని మారుతి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శనివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, దేవాలయాలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. మానసిక ప్రశాంతత, సుఖశాంతుల కోసం ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :