Thursday, 24 September 2026 10:17:33 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా కలెక్టర్ కె. హైమావతి

Date : 07 September 2026 01:50 PM Views : 40

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సిద్దిపేట, సెప్టెంబర్ 7: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను వినియోగించడం వల్ల చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచించారు.మట్టి గణపతుల వినియోగంతో నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు చొరవ చూపాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు.ప్రస్తుత కాలంలో పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో గాలి, నీరు, నేల కాలుష్యాన్ని నియంత్రించడం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో బాధ్యత, అవగాహన పెంపొందినప్పుడే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన నేలను అందించగలమని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, ఎస్‌డీసీ సుదర్శన్ రెడ్డి, ఆర్‌సీ పురం కాలుష్య నియంత్రణ మండలి అధికారి టి. రవీందర్, ఏఓ రాజ్‌కుమార్, సహాయ పర్యావరణ శాస్త్రవేత్తలు, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆర్‌సీ పురం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :