ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : ప్రజల ఇళ్ల ముందు చెత్త పేరుకుపోకుండా, వీధుల్లో మురుగు నిలవకుండా, మురుగు కాలువలు, భూగర్భ డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. మూడు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజూ కష్టపడుతున్న కార్మికుల కుటుంబాలు మాత్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. తమ శ్రమకు తగిన వేతనం సకాలంలో అందకపోవడం బాధాకరమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కనీస వేతనాలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలకు ప్రజలు అండగా నిలవాలని కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు