Friday, 25 September 2026 12:21:06 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి

మృతదేహానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Date : 09 September 2026 08:05 PM Views : 42

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి మహిళా పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆసుపత్రికి చేరుకుని హరిప్రసాద్ మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం హరిప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్పీ, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. పోలీసు శాఖ హరిప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ 1993లో ఉమ్మడి మెదక్ జిల్లాలో సివిల్ పోలీసు కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో నియమితులయ్యారు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందించారు. గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.హరిప్రసాద్ మృతితో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. సహచర పోలీసులు ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ సత్యయ్య గౌడ్, మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు జనార్ధన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :