ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: సెలైన్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పటాన్‌చెరు, సంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీడాకారులు వీరస్వామి, అంజలి అద్భుత ప్రతిభ కనబరిచారు. 45 ప్లస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం, 90 ప్లస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకం సాధించారు.ఈ సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి క్రీడాకారులు వీరస్వామి, అంజలిని ఘనంగా సన్మానించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మైత్రి గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో వారికి రూ.50 వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి పటాన్‌చెరు ప్రాంతానికి, సంగారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. యువత క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Admin
ప్రజా పిలుపు