Friday, 25 September 2026 10:13:38 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ఎస్‌ఐఆర్ శిబిరాల పరిశీలన చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్

రాష్ట్రంలో 60 శాతం డిజిటలైజేషన్ పూర్తిగ్రామీణ ప్రాంతాల్లో 80%,పట్టణ ప్రాంతాల్లో 45% పూర్తయిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ*

Date : 17 July 2026 11:53 AM Views : 172

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 60 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్, ఐలాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ఆయన గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా శిబిరాల నిర్వహణ తీరును పరిశీలించి, బీఎల్వోలు, అధికారులతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వం గడువు పొడిగించిన నేపథ్యంలో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 80 శాతం, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మేర ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బీఎల్వోలు, బీఎల్ఓల సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.డిజిటలైజేషన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి భారీ సంఖ్యలో సిబ్బంది ఆన్‌లైన్‌లో పని చేయడంతో కొన్నిసార్లు సర్వర్ మందగించడం లేదా డౌన్ కావడం సహజమని, అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఎన్యూమరేషన్ పత్రాలు అందని వారు సంబంధిత సూపర్వైజర్లను సంప్రదించి వాటిని తీసుకుని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచించారు. జిల్లా యంత్రాంగం, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, బిఎల్ఓ లు, బి ఎల్ ఏ లు పాల్గొన్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :