ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. నల్లబెల్లి సందీప్ (18) అనే విద్యార్థి అక్టోబర్ 31వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిన సందీప్, స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి మళ్లీ బయటకు వెళ్లాడు. అయితే అప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.విద్యార్థి తల్లి సింహాచలం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు స్నేహితులు, తెలిసిన వారి వద్ద విచారించినప్పటికీ సందీప్ ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదేమీ లేక నవంబర్ 1వ తేదీన చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి ఆచూకీ కనుగొని సురక్షితంగా ఇంటికి చేర్చాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి విద్యార్థి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు