ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఆర్సీపురం, ప్రజా పిలుపు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని పలు వినాయక మండపాల్లో సోమవారం విఘ్నేశ్వరుడికి ఘనంగా తొలి పూజలు నిర్వహించారు. సండే మార్కెట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.పూజారులు వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి పూలమాలలు సమర్పించి, ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వినాయకుడి మండపం చుట్టూ ఆకర్షణీయమైన అలంకరణలు చేపట్టడంతో పాటు విద్యుద్దీపాలతో మండపాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద భక్తుల సందడి నెలకొంది. నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Admin
ప్రజా పిలుపు