Friday, 25 September 2026 01:21:27 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

*డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లకు ఐదు రోజుల జైలు, రూ.10 వేల జరిమానా*

Date : 04 August 2026 07:37 PM Views : 69

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు లారీ డ్రైవర్లకు సిద్ధిపేట ప్రత్యేక రెండో తరగతి న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు.సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని బుధవారం ప్రత్యేక రెండో తరగతి న్యాయమూర్తి కాంతారావు ఎదుట హాజరుపరచగా, విచారణ అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు.శిక్షపడిన వారిలో కాసార్ల మల్లేశం (తోగుట, సిద్ధిపేట జిల్లా), చుక్కల రవి (పశ్చిమ గోదావరి జిల్లా) ఉన్నారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :