ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ స్థాయి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.రామచంద్రాపురంలోని బాలాజీ గార్డెన్స్‌లో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణకు సంబంధించిన దరఖాస్తుల వినియోగంతో పాటు, పాత ఓటర్ల వివరాల అనుసంధానం, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై బూత్ స్థాయి ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా, ఎలాంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో బూత్ స్థాయి ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, ప్రతి అర్హుడి వివరాలు నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కోఆర్డినేటర్ వెన్నెల, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు