Tuesday, 10 November 2026 03:51:27 PM
# యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి

ఐజేయూ సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో పటాన్‌చెరు జర్నలిస్టులకు చోటు

*జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శిగా చెన్న బసవేశ్వర్*. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఐజేయూ రాష్ట్ర అధ్య

Date : 09 July 2026 05:56 PM Views : 152

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం నాడు జిల్లా కేంద్రంలో ఐజేయూ జిల్లా మహాసభలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ మహాసభలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు.జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్, ఉపాధ్యక్షునిగా శ్రీనాథ్, సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా చెన్న బసవేశ్వర్, సంయుక్త కార్యదర్శిగా భూపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభకు ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన చెన్న బసవేశ్వర్ (ప్రధాన కార్యదర్శి), భూపాల్‌రెడ్డి (సంయుక్త కార్యదర్శి)లకు కీలక పదవులు లభించడంపై స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గానికి పటాన్‌చెరు ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మాట్లాడుతూ... తమపై నమ్మకంతో ఇంతటి పెద్ద బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర, జిల్లా ఐజేయూ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బలోపేతానికి తమ శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారంతో పాటు సంఘం అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తామని వారు స్పష్టం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :