Friday, 25 September 2026 05:29:05 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

ఐదేళ్లలోపు ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలి: టెలికం బోర్డు సభ్యుడు బైండ్ల కుమార్

Date : 28 June 2026 06:00 PM Views : 416

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు, జూన్ 28: దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని టెలికం బోర్డు సభ్యుడు, బీజేపీ జిల్లా నాయకుడు బైండ్ల కుమార్ పిలుపునిచ్చారు.జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అంబేద్కర్ కాలనీ ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ పిల్లలకు ప్రతి విడతలోనూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.ఒకప్పుడు దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పోలియో వ్యాధిని పల్స్ పోలియో కార్యక్రమాల ద్వారా సమర్థవంతంగా నియంత్రించగలిగామని, ఆ విజయాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి పల్స్ పోలియో విడతలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ మళ్లీ చుక్కలు వేయించడం పూర్తిగా సురక్షితమే కాకుండా, వారి రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మాజీ వార్డు కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :