ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు గురుపౌర్ణమి పర్వదినాన్నిపురస్కరించుకుని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, గురుపూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు అత్యున్నత స్థానం ఉందని,గురువును దైవస్వరూపంగా భావించి ఆరాధించడం మన హైందవ సంప్రదాయమని అన్నారు.గురువులు చూపిన సన్మార్గంలో నడుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలనిఆయన పిలుపునిచ్చారు.గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు కలిసి ప్రధాన అర్చకులు రాధాకృష్ణను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలు పొందారు.అలాగే ప్రహ్లాద్ ఆధ్వర్యంలో గురుపూజ కార్యక్రమాన్ని నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. భక్తులు స్వామివారి కృపతో పాటు గురువుల ఆశీస్సులు అందరికీ లభించి, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు.
Admin
ప్రజా పిలుపు