Sunday, 08 November 2026 02:47:29 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం

బీరంగూడ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

Date : 31 October 2026 07:27 PM Views : 39

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : విద్యార్థులు చిన్న వయస్సు నుంచే చట్టాలు, రాజ్యాంగ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య సూచించారు. హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం బీరంగూడ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బాలల రక్షణ చట్టం (పోక్సో), సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలికల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పౌర బాధ్యతల గురించి వివరించారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవించాలని, ఎలాంటి అన్యాయం జరిగినా భయపడకుండా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని తెలిపారు. బాలలపై జరిగే నేరాల విషయంలో అవగాహన కలిగి ఉండాలని, మంచి అలవాట్లు అలవరుచుకుని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.పుస్తక జ్ఞానంతో పాటు చట్టాలపై అవగాహన, సామాజిక స్పృహ, పౌర బాధ్యతలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :