Monday, 09 November 2026 03:14:28 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనసేన పార్టీలోకి కొండా సుస్మిత..?

రేపు జనసేన కీలక నేతలతో భేటీకి రంగం సిద్ధమైనట్లు ప్రచారం

Date : 23 August 2026 08:03 PM Views : 65

ప్రజా పిలుపు / తెలంగాణ / వరంగల్ : తెలంగాణ రాజకీయాల్లో కొండా సుస్మిత వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరిగిన వేళ.. సుస్మిత జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది.ఇటీవల సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకత్వం తీవ్రంగా స్పందించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె తదుపరి రాజకీయ అడుగుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని సుస్మిత ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపు జనసేన పార్టీకి చెందిన కీలక నేతలతో సుస్మిత భేటీ కానున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్‌లోని ఓ కీలక నేత నివాసంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం.భేటీలో పరకాల అసెంబ్లీ టికెట్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జనసేనలో సుస్మిత చేరికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.కాగా, పరకాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని సుస్మిత మార్చిలోనే ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :