Thursday, 24 September 2026 08:55:51 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు

ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

Date : 07 September 2026 02:35 PM Views : 40

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు తమ సమస్యలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, ఐపీఎస్‌ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, వారితో నేరుగా మాట్లాడి సమస్యలను ఓపికగా విన్నారు.ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును ఎస్పీ స్వయంగా పరిశీలించి, సంబంధిత సమస్యల వివరాలను ఫిర్యాదుదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, సమస్యల పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ మాట్లాడుతూ, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో తమ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి చట్టపరమైన పరిష్కారం చూపించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీస్‌ శాఖపై మరింత నమ్మకం కలిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :