ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సంగారెడ్డి జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజా శాంతికి, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎలాంటికార్యక్రమాలుచేపట్టరాదనిసూచించారు.అదేవిధంగా ప్రజాధనానికి నష్టం కలిగించే, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా నిషేధిత కార్యక్రమాలు నిర్వహించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు.
Admin
ప్రజా పిలుపు