Sunday, 08 November 2026 02:23:31 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు

రాత్రివేళ ప్రయాణికులు, స్థానికులకు తప్పని ఇబ్బందులు

Date : 06 November 2026 07:08 PM Views : 79

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని నవ్య ఎక్స్‌ రోడ్డులో వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రివేళ ప్రయాణికులు, స్థానిక నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై సరైన వెలుతురు లేకపోవడంతో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు, రహదారిపై ఉన్న అడ్డంకులు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు చీకటిలో ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. రాత్రివేళ ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి, పనిచేయని వీధి దీపాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రహదారిపై తగిన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :