ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ, ఇతర వసతులు అందించే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, వెంకటేశ్, అశోక్, డీఈ కృష్ణవేణి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు