ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చేరు పట్టణంలోని మైత్రి మైదానంలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక టపాసుల దుకాణాలను పటాన్‌చేరు సీఐ ఎం. రవీందర్ పరిశీలించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా ఫైర్, పోలీస్, జీఎస్టీ శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు. ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహించినా సంబంధిత వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి దుకాణదారుడు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా నీరు, ఇసుకతో కూడిన బకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అగ్నిప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వ్యాపారులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, టపాసుల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు