ప్రజా పిలుపు / తెలంగాణ / సూర్యాపేట : కోదాడ పట్టణ శివారులో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.రాజమండ్రి నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్న క్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని కర్ణాటక రాష్ట్రంలోని దామరాజనగర్ జిల్లా హన్నూర్ తాలూకాకు చెందిన సెల్వ సూర్య (26), రాజగౌడన్ మురుగన్ (40)గా గుర్తించారు.ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఈశ్వర్, శివప్ప (కర్ణాటక), రాజు (ఒడిశా) పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Admin
ప్రజా పిలుపు