Thursday, 24 September 2026 08:06:16 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ఈదుల నాగులపల్లిలో ర.25 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభం

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.3 లక్షల విరాళం

Date : 22 September 2026 04:20 PM Views : 46

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామంలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.ఈదుల నాగులపల్లిలో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌కు మరింత అభివృద్ధి, అవసరమైన సౌకర్యాల కల్పన కోసం తన సొంత నిధుల నుంచి రూ.3 లక్షలు అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడే సామాజిక వేదికలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలకు సౌకర్యం కలుగుతుందని అన్నారు.నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కుల, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు రాములు గౌడ్, డీఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు రవీందర్ రెడ్డి, కొమరయ్య, శ్రీకాంత్, నాగరాజు, శ్రీశైలం, నాయకులు రమేష్, చెన్నారెడ్డి, సాయి చరణ్ గౌడ్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :