Thursday, 24 September 2026 09:06:06 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

నారాయణఖేడ్‌ మండలంలో వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ శ్రీశైలం*

Date : 27 June 2026 04:51 PM Views : 229

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్27:-సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్:ఇటీవల నారాయణఖేడ్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ శ్రీశైలం సూచించారు.గత నెల రోజులుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు తాళాలు,బీరువాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారని తెలిపారు.కొన్ని ఇళ్లలో కనీసం ఐదు తులాల బంగారం వరకు చోరీకి గురైనట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నగదు,బంగారం,వెండి వంటి విలువైన వస్తువులను ఉంచవద్దని కోరారు.ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,ఒక గ్రాము బంగారం ధరతోనే ఇంటికి భద్రతను పెంచుకోవచ్చని సూచించారు.అలాగే,ఏదైనా పనిమీద ఊరు విడిచి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని,వీలైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా తెలియజేయాలని సూచించారు.ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని, పోలీసుల సూచనలను పాటించి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ శ్రీశైలం విజ్ఞప్తి చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :