ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ మండల పరిధిలోని అమీన్‌పూర్ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలోని సర్వే నంబర్ 993/1లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని, ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Admin
ప్రజా పిలుపు