Saturday, 26 September 2026 11:30:43 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

ఓటరు జాబితా సవరణలో ప్రజలు భాగస్వాములు కావాలి: కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్

గజ్వేల్ 14వ వార్డులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం

Date : 03 July 2026 10:03 PM Views : 97

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో బూత్ నంబర్లు 140, 136, 137 పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం గుమటం సమీపంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ ఓట్ల గుర్తింపు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియలో సహకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి స్థానికులను కలిసి ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అవసరమైన విధానాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్, బీఎల్ఏ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్‌తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :